తమిళనాడు సీఎంగా 7న స్టాలిన్‌ ప్రమాణ స్వీకారం

తమిళనాడు సీఎంగా 7న స్టాలిన్‌ ప్రమాణ స్వీకారం

తమిళనాడు సీఎంగా డీఎంకే అధినేత స్టాలిన్‌ ఈనెల 7న (శుక్రవారం) పదవీ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం చాలా నిరాడంబరంగా జరుగనుంది. ద్రవిడ మున్నేట్ర కళగం (DMK) విజయం సాధించిన తర్వాత స్టాలిన్‌ మెరీనా బీచ్‌లోని ఆయన తండ్రి కరుణానిధి స్మారకాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మరోవైపు ప్రస్తుతం సీఎం పళనిస్వామి రాజీనామా చేశారు. రేపు(మంగళవారం) అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు సమావేశమై... స్టాలిన్‌ను అసెంబ్లీ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు.

జయలలిత మరణించిన తర్వాత తొలిసారి జరిగిన తమిళనాడు ఎన్నికల్లో DMK పార్టీ సత్తా చాటింది. మొత్తం 234 నియోజకవర్గాలున్న అసెంబ్లీలో 156 స్థానాలను DMK కూటమి  సొంతం చేసుకుంది. పదేళ్ల నిరీక్షణ తర్వాత మళ్లీ డీఎంకేకు అధికారం వరించింది. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సీఎం పదవిని అధిరోహించనున్నారు.