పెటా టిఎస్‌‌‌‌‌‌‌‌ గౌరవాధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఆదినారాయణ

పెటా టిఎస్‌‌‌‌‌‌‌‌ గౌరవాధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఆదినారాయణ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌: వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం తెలంగాణ (పెటా టిఎస్‌‌‌‌‌‌‌‌) రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షుడిగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ మేరకు ఏక్రగీవంగా ఎన్నుకుంది. గురువారం సమావేశమైన రాష్ట్ర కార్యవర్గం 2025–-27కు నూతన కమిటీని సైతం ఎన్నుకుంది. అధ్యక్షుడిగా బి. రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పొన్నగాని కృష్ణమూర్తి గౌడ్‌‌‌‌‌‌‌‌, కార్యవర్గ అధ్యక్షుడిగా నాగరాజు, కోశాధికారిగా శక్రు నాయక్‌‌‌‌‌‌‌‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

పెటా టిఎస్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌‌‌‌‌‌‌‌రెడ్డి రంగారెడ్డి, క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్‌‌‌‌‌‌‌‌) చైర్మెన్‌‌‌‌‌‌‌‌ కే. శివసేనా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇటీవల గెజిటెడ్‌‌‌‌‌‌‌‌ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన వ్యాయామ విద్య ఉపాధ్యాయులు, 33 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులను ఈ సందర్భంగా సన్మానించారు.