బలహీనవర్గాలకు అండగా కాంగ్రెస్ : విప్ఆది శ్రీనివాస్

బలహీనవర్గాలకు అండగా కాంగ్రెస్ : విప్ఆది శ్రీనివాస్

వేములవాడ/కోనరావుపేట, వెలుగు: బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్​ ప్రభుత్వం అండగా ఉంటుందని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​అన్నారు. బుధవారం వేములవాడ పట్టణంలోని ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో వేములవాడ అర్బన్, రూరల్, కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌‌‌‌‌‌‌‌ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో పేదల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

 దేశం కోసం ఇందిరమ్మ ప్రాణ త్యాగం చేశారని, దేశంలో ఆమె ప్రవేశ పెట్టిన పథకాలు నేటికీ అమలు అవుతున్నాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు విజయప్రకాశ్ రావు, కీర్తన, మార్కెట్​ కమిటీ చైర్మన్​ రాజు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, కోనరావుపేట కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, తదితరులు పాల్గొన్నారు.

 కబడ్డీ శిక్షణ శిబిరం ప్రారంభం 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా జూనియర్ కబడ్డీ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. eఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి క్రీడల అభివృద్ధి కోసం క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. జిల్లా పరిధిలో క్రీడాకారులు ముందుకు వస్తే రాష్ట్ర స్థాయిలో క్రీడలను నిర్వహించడానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం కబడ్డీ మ్యాటును క్రీడాకారులకు అందజేశారు.