ఉత్తమ్ మొఖం చాటేశారు.. నాపై పోలీస్ కేసు పెట్టించారు

ఉత్తమ్ మొఖం చాటేశారు.. నాపై పోలీస్ కేసు పెట్టించారు

హైదరాబాద్: పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక మొఖం చాటేశారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.. తనపై పోలీసులకు ఫిర్యాదు చేయించి కేసు పెట్టించారని తెలిపారు. తాను పూర్తి వాస్తవాలతో చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సిట్టింగ్ జడ్జి విచారణకూ రెడీ అని పేర్కొన్నారు. 

మంత్రి తాను మాట్లాడలేక అధికారులతో స్టేట్మెంట్ ఇప్పించారని ఆరోపించారు.  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి పౌరసరఫరాలశాఖపై అవగాహన లేదని న్న​రు. తాను బాధ్యతగల ప్రజాప్రతినిధిగా సివిల్ సప్లైస్ శాఖలో అవినీతిని బయటపెట్టానని చెప్పారు. దానికి సమాధానం చెప్పడం లేదని అన్నారు.