ఆ హత్య కేసులో బీజేపీ కావాలని రాద్ధాంతం చేస్తోంది

ఆ హత్య కేసులో బీజేపీ కావాలని రాద్ధాంతం చేస్తోంది

నిజామాబాద్: న్యావనందిలో జరిగిన మమత హత్య కేసులో బీజేపీ కావాలని రాద్ధాంతం చేస్తోందని నిజామాబాద్ రూరల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిందితులను కాపాడుతున్నారని బీజేపీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. న్యావనంది హత్య కేసులో నిందితులు ఎవరు ఉన్నా కఠినంగా శిక్షించాలని డీజీపీని కోరామ‌ని చెప్పారు. తనపై ఎంపీ అరవింద్ చేస్తున్న ఆరోపణలపై పరువు నష్టం దావా వేస్తాన‌ని హెచ్చ‌రించారు. తాను రౌడీయిజం చేయకున్నా.. చేస్తున్నాననీ తరుచూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ‘నీకు దమ్ముంటే నేను ఎక్కడ భూ కబ్జాలు చేశానో, ఏ హత్య కేసులో ఎవరికి సపోర్ట్ చేశానో నిరూపించు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఎంపీ అరవింద్‌ను వదిలి పెట్టను’ అని బాజిరెడ్డి హెచ్చరించారు.