అభివృద్ధిలో ఆలేరును అగ్రగామిగా నిలుపుతా : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

అభివృద్ధిలో ఆలేరును అగ్రగామిగా నిలుపుతా : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు: అభివృద్ధిలో ఆలేరు నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. యాదగిరిగుట్టలో రూ.3 కోట్లతో నిర్మించనున్న పాతగుట్ట బీటీ రోడ్డు పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు ఏసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి ఆమడ దూరంలో నిలిచిందని ఆరోపించారు. 

యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం పేరుతో పట్టణాన్ని అతలాకుతలం చేసిందన్నారు.  ఇండ్లు, షాపులను కూల్చేసి, నిర్వాసితులను రోడ్డున పపేసిందని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక యాదగిరిగుట్ట పట్టణానికి పూర్వవైభవం తేవడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంగ సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు మల్లేశ్ యాదవ్, అనిల్, టౌన్ అధ్యక్షుడు భిక్షపతి, మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, నాయకులు హేమేందర్ గౌడ్, నరసింహ గౌడ్ తదితరులున్నారు.

సెప్టెంబర్ 19న వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ

యాదగిరిగుట్టలో అంబేద్కర్ విగ్రహం పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న విగ్రహాన్ని సెప్టెంబర్ 19న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేతులమీదుగా ఆవిష్కరించనున్నట్లు వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి అయిలిమల్లు, జిల్లా అధ్యక్షుడు పల్లపు బాలయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం యాదగిరిగుట్టలో విప్​ను కలిసి ఆహ్వానపత్రం అందించారు.  సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మల్లేశ్, ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ దానయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుర్గయ్య  తదితరులున్నారు.