
నిజామాబాద్, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పట్ల సర్కారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్భూపతిరెడ్డి అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యతోపాటు భోజనం, పుస్తకాలు, యూనిఫాం ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు.
యువజన నాయకుడు ఉమ్మాజీ నరేశ్ అందజేసిన స్ట్పోర్ట్స్ డ్రెస్ ను ఆదివారం సిరికొండ గిరిజన ఆశ్రమ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హాస్టల్ స్టూడెంట్స్ కాస్మోటిక్ చార్జీలు పెంచామన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో యూత్నాయకుడు గోపి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.