V6 News

బీఆర్ఎస్, బీజేపీ దోస్తీ బయటపడింది : ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్

బీఆర్ఎస్, బీజేపీ దోస్తీ బయటపడింది :  ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్
  • ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్

ఖానాపూర్, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీ పార్టీలది లవ్ జిహాద్ బంధం లాంటిందని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ విమర్శించారు. మంగళవారం ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ చైర్ పర్సన్ పదవీ బాధ్యతల స్వీకరణ  కార్యక్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. 

ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని తెలిపారు. చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికల్లో జతట్టిన బీఆర్​ఎస్, బీజేపీ దోస్తీ బట్టబయలైందన్నారు. ఆ రెండు పార్టీలను తీరును ప్రజలు గమనిస్తున్నారని,  సరైన సమయంలో తగిన గుణ పాఠం చెబుతారని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దయానంద్, ఎన్.రమేశ్, మున్సిపల్ మాజీ చైర్​పర్సన్ రాజురా సత్యం, ఆత్మ చైర్మన్ తోట సత్యం తదితరులు పాల్గొన్నారు.

త్వరలోనే మండల కమిటీల నియామకం

నిర్మల్, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఈనెల 18లోగా మండల పార్టీ కమిటీల నియామకాలను పూర్తి చేస్తామని బొజ్జు పటేల్ తెలిపారు. మంగళవారం నిర్మల్ లో నిర్వహించిన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమర్థులైన కార్యకర్తలను గుర్తించి బూత్ లెవెల్ ఇన్​చార్జీలుగా నియమించాలని నేతలకు సూచించారు. 

పార్టీలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు అధిష్టానం తగిన గుర్తింపు నివ్వాలని సమావేశంలో పలువురు సీనియర్ నేతలు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్​పర్సన్ గణేశ్ చక్రవర్తి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ తదితరులు పాల్గొన్నారు.