
న్యూఢిల్లీ, వెలుగు: ఎన్నికల అఫిడవిట్ కేసు లో కోదాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌కు సుప్రీంలో చుక్కెదురైంది. హైకోర్టు తన వివరణను తీసుకునేలా ఆదేశాలివ్వాలంటూ మూడేండ్ల తర్వాత సుప్రీంలో పిటిషన్ వేయడంపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వలోని బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి బీఆర్ఎస్ అభ్య ర్థిగా మల్లయ్య యాదవ్ స్వల్ప ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డిపై గెలిచారు.
ఈసీకి సమర్పించిన అఫిడవిట్లో ఆస్తుల వివరాలతో పాటు ఓట్ల కౌంటింగ్‌లోనూ పొరపాట్లు జరిగాయంటూ పద్మావతి రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వివరణ ఇవ్వా లంటూ 5సార్లు హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా హాజరుకాలేదు. మల్లయ్య వాదన లను వినేదిలేదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైకోర్టు తన వివరణను తీసుకునేలా ఆదేశాలివ్వాలంటూ మల్ల య్య సుప్రీంను ఆశ్రయించగా.. అక్కడా చుక్కెదురైంది.