దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతీ నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్

దేశంలో  ఎక్కడా లేని విధంగా ప్రతీ నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్

దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే జరిగిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన హరీష్ రావు... క్యాంపు కార్యాలయం ఉండడం ద్వారా శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రజలందరూ వారి సమస్యలు తెలిపేందుకు వేదికగా ఈ క్యాంపు ఆఫీసులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఎం ఆదేశాలతో ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో క్యాంపు కార్యాలయాలు  ఏర్పాటు  చేసేందుకు కృషి చేస్తు్న్నామని హరీష్ రావు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించామని ఆయన అన్నారు. కాగా ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే  మహేష్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే  మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. అయితే ఈ కార్యాలయం నిర్మించిన నాలుగేళ్ల తర్వాత.. ఇప్పుడు ప్రారంభించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

 

వికారాబాద్, నారాయణ్ పేట్ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్ధాపనలు చేసేందుకు వెళ్తున్న ఆర్థిక, ఆరోగ్య శాఖ...

Posted by Harish Rao Thanneeru on Wednesday, June 15, 2022