సంగారెడ్డి టౌన్, వెలుగు: గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం సదాశివపేట పట్టణంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన పార్టీ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. గత ప్రభుత్వంలో పంచాయతీలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు.
కేసీఆర్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో హరిదాస్పూర్, మారేపల్లి, తుమ్మల బాయి తండా, మాచిరెడ్డిపల్లి, చర్లగూడెం సర్పంచులు, వార్డ్ మెంబర్లు ఉన్నారు. కార్యక్రమంలో కంది మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మాణిక్యం, మాజీ సర్పంచ్ మొగులయ్య ఉన్నారు.
