సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలను పరిష్కరించండి : ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలను పరిష్కరించండి  : ఎమ్మెల్యే చింత ప్రభాకర్

కొండాపూర్, వెలుగు: సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో అడిషనల్‌ కలెక్టర్ చంద్రశేఖర్‌‌ను కలిసి ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు.  

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎమ్మెల్యే కోటాలో 40 శాతం మంజూరు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయాలని కోరారు. ఈమేరకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సూచించిన ఎండర్స్​మెంట్‌ అడిషనల్‌ కలెక్టర్‌‌కు అందజేశారు. కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, అక్బర్, తదితరులు ఉన్నారు