
హైదరాబాద్: తెలంగాణ క్రీడాకారులను ఐపీఎల్ లో అంటరాని వారిగా చూస్తున్నారన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఐపీఎల్-21 సీజన్ కు ఇటీవల జరిగిన వేలంలో SRH టీమ్ కోసం తెలంగాణ క్రీడాకారులకు అవకాశం రాకపోవడంపై దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని తెలిపారు. టాలెంట్ ఉన్న క్రీడాకారులకు గుర్తింపు రావడం లేదన్న ఆయన..HCAను కొందరే తమ కబంధ హస్తాల్లో ఉంచుకున్నారన్నారు. కొంతమంది పిల్లలనే క్రీడాకారులుగా అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు. క్రీడా రంగానికి కేసీఆర్ ఈసారి బడ్జెట్ లో వందల కోట్లు కేటాయిస్తారని చెప్పుకొచ్చారు దానం నాగేందర్.