బీసీలను నిలువునా ముంచిన కాంగ్రెస్: అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్

బీసీలను నిలువునా ముంచిన కాంగ్రెస్: అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్

నిజామాబాద్ అర్బన్​, వెలుగు: ఎన్నికల సమయంలో బీసీలకు ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రాగానే వారిని నిండా ముంచిందని  అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం నగరంలోని పలు డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  బీసీలకు లక్షా అరువై వేల కోట్లను కేటాయిస్తామని హామీ  ఇచ్చి ఇప్పటి వరకు 200కోట్లను కూడా కేటాయించలేదన్నారు.

పేద మధ్య  తరగతి విద్యార్థులకు ఫీజు రీయీంబర్స్​మెంట్​ రావడంలేదని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను పక్కదారి మల్లిస్తున్నారని, కేంద్ర పథకాల పేర్లను మార్చుతూ తామే అమలు చేస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.   బీజేపీ అధికారంలోకి రాగానే ఇందూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చుదిద్దుతామని, ప్రజలు ఒక్కసార బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.