
నర్సంపేట, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డిని వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కొడుకు దొంతి అవియుక్త్రెడ్డి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని సీఎం నివాసంలో కలిశారు. ఇటీవల హనుమకొండలో జరిగిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన సీఎం తనను కలవాల్సిందిగా అవియుక్త్రెడ్డికి సూచించారు. దీంతో శుక్రవారం సాయంత్రం సీఎంను ఆయన కలిసి నర్సంపేట నియోజకవర్గ పరిస్థితులను వివరించారు.