స్వార్ధ రాజకీయాల కోసం నన్ను బలి చేస్తున్నారు: శేజల్

స్వార్ధ రాజకీయాల కోసం నన్ను బలి చేస్తున్నారు: శేజల్

బీఆర్ఎస్ ఎమ్యెల్యే దుర్గం చిన్నయ్యపై చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవు అంటున్నారు..నాలుగు గోడల మధ్య జరిగిన దానికి ఆధారాలు ఉంటాయా..అయినా కూడా తన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయని ఎమ్యెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ తెలిపింది. 6 నెలల నుండి న్యాయం కోసం పోరాటం చేస్తున్నా.. ఆడపిల్ల అని కూడా చూడకుండా కేసును నిరుగారుతున్నారని ఆమె ఆరోపించింది. జూన్ 29న మరోసారి ఆత్మహత్యాయత్నం చేసిన శేజల్ ఆస్పత్రి నుండి డిచ్చార్జీ అయిన తర్వాత జూన్ 30వ తేదీ శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో కీలక వ్యాఖ్యాలు చేసింది.

"నిన్న (జూన్ 29) హాస్పిటల్ లో కూడా నా సోదరుడిని పోలీసులు కొట్టారు. హాస్పిటల్ నుండి మీరు వెళ్లిపోండి బయట గొడవ జరుగుతుంది అన్నారు. పోలీసులు తను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నా విషయంలో ఎవరి ప్రమేయం లేదు. నాకు సహహకరించే వాళ్లని కూడా బెదిరిస్తుంనారు. నేను పోరాటం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కేటీఆర్ ఎలాంటి ఆధారాలు లేవు అన్నడం బాధ కలిగించింది. న్యాయం చేయాల్సిన మంత్రే అలా మాట్లాడితే నాకు న్యాయం ఎవరు చేస్తారు. ఒక ఎమ్యెల్యేని కాపాడుకోవడానికి నా క్యారెక్టర్ బాడ్ చేస్తున్నారు. వాళ్ళ స్వార్ధ రాజకీయాల కోసం నన్ను బలి చేస్తున్నారు. రానున్న రోజుల్లో నా పోరాటం కొనసాగిస్తా" అని శేజల్ ఆవేదన వ్యక్తం చేసింది.

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య  తనను లైంగికంగా వేధించారని శేజల్ గత కొంతకాలంగా పోరాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు పదిహేను రోజులకు పైగా ఢిల్లీలో పోరాటం చేసిన ఆమె.. జాతీయ మహిళా కమిషన్ కు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం జరగడం లేదని ఆవేనదతో గతంలో కూడా న్యూఢిల్లీలోనే ఆత్మాహత్యాయత్నం చేసింది.