ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఎమ్మెల్యే ఈటల రాజేందర్​

కమలాపూర్/ గూడూరు, వెలుగు: వీఆర్ఏల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని హుజూరాబాద్​ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. శుక్రవారం కమలాపూర్​ తహసీల్దార్​ఆఫీస్​ఎదుట వీఆర్ఏల దీక్షలకు ఈటల హాజరై మద్దతు తెలిపారు. దీక్ష శిబిరంలో కొంత సేప వీఆర్ఏలతో కలసి కూర్చున్న ఈటల వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీఆర్ఏల డిమాండ్ల సాధనకు కలిసి పోరాడుతామన్నారు. వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షురాలు కొడేపాక విజయలక్ష్మి, మండలాధ్యక్షులు పాల్గొన్నారు. 

 వీఆర్ఏల డిమాండ్లపై అసెంబ్లీలో కొట్లాడుతా..
 వీఆర్ఏల డిమాండ్ల సాధనకు వచ్చే అసెంబ్లీ సెషన్స్​లో ప్రభుత్వంతో కొట్లాడుతానని ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. సీఎం కేసీఆర్​ వీఆర్ఏలకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గూడూరు మండల కేంద్రంలో  చేపట్టిన రిలే  దీక్షకు సీతక్క హాజరై సంఘీభావం తెలిపారు. 

మావోయిస్టుల సమాచారమిస్తే రివార్డ్
​ 
కొత్తగూడ/ భూపాలపల్లి, వెలుగు: మావోల సమాచారం ఇస్తే బహుమతి ఇస్తామని మహబూబాబాద్​ఎస్పీ శరత్​ చంద్ర పవార్ తెలిపారు. శుక్రవారం కొత్తగూడ పోలీస్​స్టేషన్​లో మావోల రివార్డుల వాల్​ పోస్టర్​ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల మావోలు ఛత్తీస్​గఢ్ ఏరియా నుంచి గంగారం మండలం అడవుల్లో సంచరిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. ఈ మేరకు కొత్తగూడ, గంగారం, బయ్యారం ఏజెన్సీ మండలాల్లో హై అలర్ట్​ ప్రకటిస్తున్నట్లు చెప్పారు.

అసాంఘిక శక్తుల సమాచారమివ్వండి
 జిల్లా యువత, ప్రజలు అపరిచిత వ్యక్తులు, మావోయిస్టుల సమాచారం పోలీసులకు ఇవ్వాలని జయశంకర్ భూపాలపల్లి  ఎస్పీ జె. సురేందర్ రెడ్డి  ఒక ప్రకటనలో కోరారు. ఇటీవల తెలంగాణలోకి చొరబడిన మావోయిస్టులు ఇన్ఫార్మర్ల పేరుతో అమాయక ప్రజలను చంపుతున్నారన్నారు. జిల్లాలో పది మంది మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం ఉందని, ఆచూకీ తెలిస్తే..ఎస్పీ ..8332841100, ఓఎస్డీ 9440904697, డీఎస్పీ కాటారం 8333923857  నంబర్లకు ఫోన్​చేసి చెప్పాలన్నారు. సమాచారం ఇచ్చిన వారికి  రూ. 5 లక్షల నుంచి 20 లక్షల వరకు  పారితోషికం ఇస్తామన్నారు. 

కాన్వొకేషన్​డేకు ముస్తాబైన ‘నిట్’

కాజీపేట, వెలుగు: వరంగల్ నిట్​20వ కాన్వొకేషన్​డే వేడుకలు శని, ఆదివారాల్లో నిర్వహించనున్నట్లు నిట్ డైరెక్టర్ ఎన్.వీ రమణారావు తెలిపారు. శుక్రవారం నిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రిజిస్ట్రార్​ఎస్​. గోవర్ధన్​రావు, అకడమిక్​ డీన్ ప్రొఫెసర్​ ఉమామహేశ్​లతో కలసి మాట్లాడారు మొదటి రోజు వారణాసిలోని బనారస్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్​సుధీర్ కె.జైన్ హాజరై అండర్ గ్రాడ్యుయేట్లకు పట్టాలు అందజేయనున్నారు. రెండవ రోజు సీఎస్ఐర్ డైరెక్టర్ జనరల్, డీఎస్ఐర్ సెక్రటరీ డా. ఎన్. కలైసెల్వి హాజరై పీహెచ్​డీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లకు పట్టాలు అందజేస్తారని తెలిపారు. కాన్వొకేషన్​లో1782 మంది  స్టూడెంట్లు పట్టాలు అందుకుంటుండగా వారిలో 98 మంది పీహెచ్​డీ, 553 మంది ఎంటెక్, 144 మంది ఎంఎస్సీ, 39 మంది ఎంబీఎ, 55 మంది ఎంసీఎ, 893 మంది బీటెక్  స్టూడెంట్లు ఉన్నారని తెలిపారు.  

బ్లాక్​స్పాట్ల పై ఫోకస్​పెట్టండి
వరంగల్ సీపీ డా.తరుణ్​జోషి

హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాక్సిడెంట్లతో రోజూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రమాదాల నివారణకు బ్లాక్​స్పాట్లపై ఫోకస్​ పెట్టాలని  వరంగల్ సీపీ డా.తరుణ్​జోషి ఆఫీసర్లకు సూచించారు. హనుమకొండ  కలెక్టరేట్ లో శుక్రవారం నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ మీటింగ్​కు హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు రాజీవ్​ గాంధీ హనుమంతు, డా.బి.గోపీతో సీపీ చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాక్సిడెంట్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ట్రాఫిక్​ రూల్స్​ పై పోలీస్​, ట్రాన్స్ పోర్ట్, నేషనల్​ హైవేస్​, ఆర్​ అండ్​ బీ సంబంధిత శాఖల అధికారులకు రోడ్డు సేఫ్టీ గురించి పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ద్వారా వివరించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ హనుమకొండ, వరంగల్ జిల్లాలోని పది ప్రాంతాల్లో యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయని, ఆయా రోడ్లను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. హెల్మెట్​రూల్​పక్కాగా అమలు చేయాలని పోలీస్​ఆఫీసర్లకు సూచించారు.
  
ఇంజినీరింగ్ లోపాలను సరిదిద్దాలి

ప్రమాదాలకు కారణమవుతున్న యూ టర్న్​లను వెంటనే మూసి వేయాలని హనుమకొండ కలెక్టర్​ రాజీవ్​ గాంధీ హనుమంతు సూచించారు.జిల్లాలో ప్రమాదాల వల్ల 2021లో 241 మంది గాయపడగా.. 106 మంది చనిపోయారన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకే 270 మందికి గాయాలు కాగా.. 110 మంది మరణించారని కలెక్టర్​ తెలిపారు. అడిషనల్​ కలెక్టర్లు సంధ్యా రాణి, శ్రీవాత్సవ తదితరులు  పాల్గొన్నారు.  

పరకాల చరిత్రను రాబోయే తరాలకు తెలపాలె

పరకాల, వెలుగు : 1947 సెప్టెంబర్​2న పరకాలలో జరిగిన మారణకాండ చరిత్రను రాబోయే తరాలకు తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పరకాలలోని అమరధామంలో స్వాతంత్ర్య వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్​సంస్థానానికి స్వాతంత్ర్యం కావాలని 1947లో  పరకాలలో అనేక మంది జాతీయ జెండాలను చేతబట్టి ర్యాలీ తీయగా రజాకార్లు జరిపిన కాల్పుల్లో 15 మంది అమరులయ్యారని అన్నారు. రజాకార్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన సజీవ దృశ్యాలను మాజీ హోం శాఖ సహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు తన తల్లి పేరున ట్రస్టు ఏర్పాటు చేసి అమరధామం కట్టించారన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుజ్జ సత్యనారాయణ రావు, డాక్టర్ సిరంగి సంతోష్ పాల్గొన్నారు.

టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిన కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/మొగుళ్లపల్లి, వెలుగు: కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భవేశ్ ​మిశ్రా టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారి పాఠాలు బోధించారు. శుక్రవారం జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల కేజీబీవీ హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న  డెవలప్​మెంట్​పనులు పరిశీలించేందుకు వెళ్లిన ఆయన ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూంకు వెళ్లి స్టూడెంట్లకు మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 20 నిమిషాల పాటు బోధించారు. అనంతరం స్కూల్లో  జరుగుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. జడ్పీటీసీ తిరుపతి రెడ్డి,ఎంపీపీ మల్లారెడ్డి, సర్పంచులు సరోత్తంరెడ్డి, మహేందర్  పాల్గొన్నారు. 

భార్య కాపురానికి వస్తలేదని వ్యక్తి ఆత్మహత్య

ఆత్మకూరు, వెలుగు: మండల కేంద్రంలో భార్య కాపురానికి వస్తలేదన్న మనస్తాపంతో మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఇంట్లో ఉరివేసుకొని చనిపోయాడు. ఎస్సై ప్రసాద్ వివరాల.. ప్రకారం సిద్దిపేట జిల్లా శివాజీనగర్​కు  చెందిన చింతకింది మనోజ్ (35) తొమ్మిదేళ్ల కింద అదే జిల్లాకు చెందిన ప్రశాంతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. రెండేళ్ల కింద ఆత్మకూరుకు వలస వచ్చి బైక్ మెకానిక్ గా పని చేస్తున్నాడు. మద్యానికి బానిసైన మనోజ్ రెండు నెలలుగా రోజూ భార్యతో గొడవపడుతూ ఉండేవాడు. పదిరోజుల కింద భార్య  పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. శుక్రవారం మద్యం మత్తులో  ప్యాన్​కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. మనోజ్ తమ్ముడి కంప్లైంట్​మేరకు కేసు ఫైల్​చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.