కష్టపడి పని చేసి ప్రజల మన్ననలు పొందాలి : ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి

కష్టపడి పని చేసి ప్రజల మన్ననలు పొందాలి :  ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి
  •     ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి 

చిన్నచింతకుంట, వెలుగు : కొత్త ఎన్నికైన సర్పంచులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్టపడి పని చేసి ప్రజల మన్ననలను పొందాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సూచించారు. శుక్రవారం దేవరకద్ర లో చిన్నచింతకుంట, కౌకుంట్ల, దేవరకద్ర మండలాల సర్పంచులు, ఉపసర్పంచ్ లు, వార్డు మెంబర్లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళవంలో ఆయన మాట్లాడారు. 

ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కోడంగల్ తర్వాత దేవరకద్ర నియోజకవర్గంలో పెద్దఎత్తున సర్పంచులను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే  ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయన్నారు. సమ్మేళనంలో మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.