ప్రభుత్వాస్పత్రిలో 24 గంటలు వైద్య సేవలు అందాలి: గండ్ర సత్యనారాయణరావు

ప్రభుత్వాస్పత్రిలో 24 గంటలు వైద్య సేవలు అందాలి: గండ్ర సత్యనారాయణరావు

జయశంకర్​భూపాలపల్లి/ చిట్యాల, వెలుగు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో 24 గంటలు వైద్య సేవలు అందించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. శానిటేషన్​పై దృష్టి సారించాలని చెప్పారు. సీఎస్ఆర్ నిధుల ద్వారా కలెక్టర్ ప్రత్యేక చొరవతో సీటీ స్కాన్ మిషన్  ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

అనంతరం చిట్యాల ఆదర్శ పాఠశాల, కళాశాల వసతి గృహాన్ని ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. గ్లీజర్, దోబీ ఘాట్​ ఏర్పాటు చేసేందుకు ఏఈ జీవన్​కుమార్​కు ఫోన్​ చేసి అవసరమైన ఎస్టిమేట్స్​ సిద్ధం చేయాలని కోరారు. అంతకుముందు వైఎస్​ఆర్​ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. అనంతరం మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కటుంబాలను పరామర్శించారు.​