గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

రేగొండ, వెలుగు: ప్రజాపాలనలో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. ఆదివారం జిల్లాలోని కొత్తపల్లిగోరి, రేగొండ మండలాల్లోని గ్రామాల్లో పార్టీ మద్దతుదారులైన సర్పంచ్​అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 

రెండేళ్ల కాలంలో ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్ధానాలతో పాటు మానవీయ కోణంలో రేషన్​ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తోందన్నారు. ఊళ్లకు మంచి చేసేవాళ్లను సర్పంచ్​లుగా గెలిపించుకుంటే అభివృద్ధికి మార్గం వేసినవాళ్లు అవుతారని సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు ఇప్పకాయల నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్​ గూటోజు కిష్టయ్య, నాయినేని సంపత్​రావు, మోడెం ఉమేశ్​గౌడ్, మ్యాకల భిక్షపతి, మటిక సంతోష్​, మైస భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.