అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు : గూడెం మహిపాల్ రెడ్డి

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు : గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను పకడ్బందీగా అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలని పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. శుక్రవారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని జీహెచ్​ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధులు, నిరక్షరాస్యులకు అవగాహన కల్పించి అప్లికేషన్లు నింపడంలో అధికారులు సాయం అందించాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప, మాజీ కార్పొరేటర్ అంజయ్య, సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, జీహెచ్​ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేశ్, సీనియర్ నాయకులు పరమేశ్​యాదవ్, గోవింద్, కుమార్ గౌడ్, ఐలేశ్​యాదవ్ పాల్గొన్నారు. 

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పటాన్​చెరు పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం ఆవరణలో నిర్మించే దుకాణాల నిర్మాణ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. డీసీసీబీ బ్యాంకు రైతులకు మరిన్ని సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో అమీన్​పూర్​ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ రాఘవేందర్ రెడ్డి, డైరెక్టర్లు, పీఏసీఎస్​చైర్మన్లు పాల్గొన్నారు. 

జిన్నారం: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలపాలిట వరంగా మారాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిన్నారం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 25 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే గతంలో కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిన 30 మంది బాధితులకు రూ.96 వేల  నష్టపరిహారాన్ని అందించారు.