సీసీ కెమెరాలతో మరింత భద్రత : ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి

సీసీ కెమెరాలతో మరింత భద్రత : ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి

అమీన్​పూర్, వెలుగు: కాలనీల భద్రతకు సీసీ కెమెరాలు ఉపకరిస్తాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి అన్నారు. అమీన్​పూర్​ మున్సిపల్​ పరిధిలోని న్యూసాయి భగవాన్​ కాలనీలో రూ.2లక్షల సొంత నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నేరాల నియంత్రణతో పాటు  నేరగాళ్లను గుర్తించడంలో సీసీ కెమెరాలు పోలీసు శాఖకు కీలకంగా ఉపయోగపడుతున్నాయన్నారు. 

రాష్ర్ట ప్రభుత్వం హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన కమాండ్​ కంట్రోల్​ సెంటర్​ ద్వారా ప్రతి కెమెరాను అనుసంధానం చేసి భద్రతాపరమైన సమస్యలు తలెత్తినప్పుడు క్షణాల్లో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారన్నారు. పటాన్​చెరు నియోజకవర్గంగలో ప్రతి గ్రామం, పట్టణం, డివిజన్​లో కమ్మూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

కాలనీ ప్రజల కోసం త్వరలోనే మినీ ఫంక్షన్​ హాల్​, పార్కును ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్​మాజీ వైస్​ చైర్మన్​ నరసింహగౌడ్​, సీఐ నరేశ్​, నాయకులు మల్లేశ్, బాలరాజు, ప్రమోద్​ రెడ్డి, అనిరుధ్​రెడ్డి, కృష్ణ, జగదీశ్​, దాసు కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.