మంజీరా డ్యామ్ కు నీళ్లు తేకపోతే ప్రజా ఉద్యమం చేస్తా

మంజీరా డ్యామ్ కు నీళ్లు తేకపోతే ప్రజా ఉద్యమం చేస్తా

మంజీరా డ్యామ్ కు నీళ్లు తేలేకపోతే ప్రజా ఉద్యమం చేపడతానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంగారెడ్డి నీళ్ళ సమస్య పై అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా, సీఎం కేసీఆర్ నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గడిచిన మూడేళ్ల నుంచి మంజీరా డ్యామ్ లో నీళ్లు లేక బోసిపోయిందని, ఎమ్మెల్యేకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా పాలిస్తున్న ప్రభుత్వం కేవలం కేసీఆర్ ప్రభుత్వమే నని మండిపడ్డారు. ప్రజావసారల దృష్ట్యా నీళ్లు అందివ్వకున్నా ఒక ఎంపీ, రెండు మున్సిపల్ చైర్మన్ పదవులు గులాబీ పార్టీకి ప్రజలు కట్టబెట్టారని జగ్గారెడ్డి గుర్తు చేసారు. తెలంగాణ మంత్రి వర్గంలో కనీస విలువలు లేని మంత్రులున్నారని ధ్వజమెత్తారు. మంజీరా నీళ్ల దొంగ హరీష్ రావు అని నామకరణం చేస్తున్నానన్నారు.‌ వచ్చే నెల 4వ తేదీన టి-కాంగ్రెస్ బృందంతో మంజీరా డ్యామ్ పర్యటిస్తానని జగ్గారెడ్డి తెలిపారు.