నీటి కరువుపై సీఎంకు లెటర్ రాసిన జగ్గారెడ్డి

నీటి కరువుపై సీఎంకు లెటర్ రాసిన జగ్గారెడ్డి

సింగూర్, మంజీరా నది జలాలను వేరే ప్రాంతాలకు వదిలి టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ప్రస్తుతం నీళ్ళు లేక ఆ డ్యామ్ లు క్రికెట్ మైదానాలను తలపిస్తున్నాయని ఆయన అన్నారు. అప్పుడు వారు చేసిన తప్పులకు జనాలు తాగు నీరు లేక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ రోజు అసెంబ్లీలో ప్రెస్ మీట్ నిర్వహించిన జగ్గారెడ్డి.. నీళ్లు లేక సంగారెడ్డి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గోదావరి నీళ్లను సంగారెడ్డికి తీసుకురావాలని సీఎం కేసీఆర్ కు లేఖ రాసినట్టుగా తెలిపారు.

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడినా.. అధికార పక్ష నేతలు రాజకీయం చేస్తున్నారని జగ్గారెడ్డి ఈ సందర్భంగా అన్నారు.  తీవ్ర నీటి ఎద్దడి ఉన్నా.. అధికారులు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకు వెళుతున్నారో లేదో అర్ధం కావడం లేదన్నారు. మిషన్ భగీరథ నీళ్లు కూడా రావట్లేదని.. అధికారులు  ఉన్నారా? కాళేశ్వరం డ్యామ్ లో పండుకున్నారా? అనేది తెలియట్లేదని అన్నారు.  టీఆర్ఎస్ నాయకులు ఈ విషయంపై నోరు మెదపడం లేదని జగ్గారెడ్డి మండిపడ్డారు.