కాంగ్రెస్ స్టేట్​ ఇన్​చార్జ్​ ఠాక్రేకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ

కాంగ్రెస్ స్టేట్​ ఇన్​చార్జ్​ ఠాక్రేకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ

హైదరాబాద్​, వెలుగు: నాలుగు జిల్లాల్లో పాదయాత్ర చేసేందుకు అనుమతివ్వాలని కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్​ రావ్​ ఠాక్రేని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఠాక్రేకి లేఖ రాశారు. మూడు సార్లు ఎమ్మెల్యేనైన తాను.. పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ హోదాలో ఈ లేఖ రాస్తున్నానని అందులో పేర్కొన్నా రు. హాత్​ సే హాత్​ జోడో యాత్రలో భాగంగా 47 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలనుకుంటు న్నానని తెలిపారు.

ఉమ్మడి మెదక్​ జిల్లాలో 10, హైదరాబాద్​లో 15, రంగారెడ్డిలో 8, మహబూబ్​నగర్​లో 14 నియోజకవర్గాల్లో పాదయా త్ర చేస్తానన్నారు. పార్టీని బలోపే తం చేసేందుకు, కార్యకర్తల్లో మనో ధైర్యం నింపేందుకు ఆయా జిల్లాల్లో పాదయాత్రకు అనుమతివ్వాలని లేఖలో కోరారు. కాగా, నిన్నమొన్న టి వరకు తాను విడుదల చేసిన లేఖలు వేరని, ఇప్పుడు ఠాక్రేకి రాసి న లేఖ వేరని జగ్గారెడ్డి చెప్పారు. 50 నియోజకవర్గాల్లో నేతలు పాదయాత్ర చేయలేదని చెప్పారు. ఠాక్రే తనకు అనుమతినిస్తారని భావిస్తున్నానని చెప్పారు.