కురవి, వెలుగు: వచ్చే నెల 5న జరిగే కందికొండ జాతర ఏరాట్లను ప్రభుత్వ విప్. డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రనాయక్ ఆదివారం పరిశీలిం చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, రహదారులు, విద్యుత్, వైద్యం, పారిశు ధ్య పనులపై దృష్టి సారించాలన్నారు.
కందికొండ జాతర అభివృద్ధి కోసం, దేవాదాయ, టూరిజం నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామన్నా రు. కార్యక్రమంలో ఎంపీడీవో వీరబాబు, డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్, డీఎస్పీ కృష్ణ కిషోర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు అంబటి వీరభద్రం గౌడ్, గార్లపాటి వెంకట్ రెడ్డి, బండి వెంకటరెడ్డి తదితరు లుపాల్గొన్నారు.
