ఎంపీ అరవింద్ కు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సవాల్
V6 Velugu Posted on Jan 26, 2022
- ఎంపీ అరవింద్ కు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సవాల్
- రైతులకు అరవింద్ ఓ లెక్కా
నిజామాబాద్: ఎంపీ ధర్మపురి అరవింద్ కు సవాల్ విసిరారు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి. కేంద్రం నుంచి నువ్వెంత తెచ్చావో చర్చకు వచ్చే దమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు. పంజాబ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి మోడీనే రైతులు అరగంట ఆపారని, అలాంటిది రైతులకు అరవింద్ ఓ లెక్కా అన్నారు. అరవింద్ అబద్దాల అడ్డా అని.. రైతులను రెచ్చగొట్టి, వారిని గుండాలు అంటున్నారన్నారు. పసుపుబోర్డు తెస్తానని ఎంపీ బాండ్ రాసిచ్చారని, బోర్డ్ ఏమైందని రైతులు అడుగుతున్నారని ఆయన నిలదీశారు. అరవింద్ ఒళ్లు దగ్గరపెట్టు కో, రైతులకు క్షమాపణ చెప్పు అని ఆయన డిమాండ్ చేశారు.