స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు: ఉప ఎన్నిక వస్తుందని కొందరు మాయ మాటలు మాట్లాడుతున్నారని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలకు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత పార్టీలో, న్యాయ నిపుణులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ చేస్తామన్నారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పలు పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుందని, కాంగ్రెస్, టీడీపీ, వైస్ఆర్సీపీ, సీపీఐ ఎల్పీలను విలీనం చేసుకుందని గుర్తుచేశారు.
అంతకుముందు స్థానిక ఎంపీడీవో ఆఫీస్‌లో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 7 మండలాల్లోని గ్రామాల్లో మంజూరైన అభివృద్ధి పనుల పురోగతిపై రివ్యూ మీటింగ్నిర్వహించారు. ప్రభుత్వం నుంచి పంచాయతీరాజ్‌శాఖ ద్వారా సీఆర్ఆర్, ఎంఆర్ఆర్, ఎస్సీపీ కింద మొత్తం నిధులు రూ.150 కోట్లు మంజూరు కోసం కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకన్న, డీపీవో స్వరూప, పీఆర్ఎస్ఈ, ఈఈ, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.