పేదలకు విద్య, వైద్యం అందించడమే లక్ష్యం : కసిరెడ్డి నారాయణరెడ్డి

పేదలకు విద్య, వైద్యం అందించడమే లక్ష్యం : కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, వెలుగు: పేద ప్రజలకు విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. బుధవారం ఆమనగల్లులో రూ.17.50 కోట్లతో నిర్మించనున్న ఆసుపత్రి బిల్డింగ్​కు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు 30 పడకల ఆసుపత్రిని 10 పడకలకు కుదించారని, కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన వెంటనే 50 పడకల ఆసుపత్రి బిల్డింగ్​కు నిధులు చేసినట్లు తెలిపారు.

కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తి చేసి వెల్దండ, అమనగల్లు, మాడ్గుల్ మండలాలకు సాగునీటిని అందిస్తామని చెప్పారు. మాజీ జడ్పీ వైస్  చైర్మన్  బాలాజీ సింగ్, మున్సిపల్  చైర్మన్  రాంపాల్ నాయక్, వైస్  చైర్మన్  దుర్గయ్య, కౌన్సిలర్లు లక్ష్మణ్, చెన్నకేశవులు, విజయకృష్ణ, కృష్ణ యాదవ్, రాధమ్మ, శ్రీధర్  పాల్గొన్నారు.