ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలి : ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి

ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలి : ఎమ్మెల్యే  కాటిపల్లి వెంకట రమణారెడ్డి
  • ఎమ్మెల్యే  కాటిపల్లి వెంకటరమణారెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలని బీజేపీ  ఎమ్మెల్యే  కాటిపల్లి వెంకటరమణారెడ్డి సూచించారు. ఆదివారం విద్యాశాఖ పద్దుపై ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. బిహార్​ లాంటి రాష్ట్రాల్లో చదువుకు 15 శాతం నిధులను బడ్జెట్​లో కేటాయిస్తున్నారన్నారు. ప్రైవేటు స్కూల్స్​ విచ్చలవిడిగా ఫీజులు పెంచుతున్నా.. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 

ప్రజలను బిలోపావర్టీ లెవెల్​కు తీసుకెళ్తున్నామే తప్ప పేదరికం నుంచి బయటకు తీసుకురాలేకపోతున్నామన్నారు.  స్కూల్​ యూనిఫామ్స్ సరిగ్గా కుట్టడం లేదన్నారు. డాక్టర్లపై ఇటీవలి కాలంలో దాడులు పెరిగాయని, వాళ్లు అభద్రతా భావంలో ఉన్నారన్నారు.