
నల్గొండ జిల్లా చండూరులో వీఆర్ఏల నిరవధిక సమ్మెకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం చండూర్ డిగ్రీ కాలేజీకి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తరుపున 5 లక్షల 10వేల విలువ గల కంప్యూటర్స్, బెంచీలు, ఎలక్ట్రిసిటీ, పెయింట్ ను అందజేశారు. పే స్కేల్, ప్రమోషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు సమ్మె చేస్తున్నారు.
కాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్కు తెరదించుతూ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. మాటలు పడి,నిందలు మోసి, ఆత్మగౌరవం లేకుండా పదవిలో కొనసాగాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసిన ఆయన.. ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉప ఎన్నిక వస్తే ఎవరిని గెలిపించాలన్నది ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.