ఎక్లాస్‌‌‌‌పూర్ లో ఉచిత క్యాన్సర్, కంటి వైద్య శిబిరాలు

 ఎక్లాస్‌‌‌‌పూర్ లో ఉచిత క్యాన్సర్, కంటి వైద్య శిబిరాలు

కోటగిరి, వెలుగు : మండలంలోని ఎక్లాస్‌‌‌‌పూర్ గ్రామంలో మంగళవారం గుమ్మడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, కంటి వైద్య శిబిరాన్ని ఫౌండేషన్​ వ్యవస్థాపకుడు గుమ్మడి శ్రీధర్ ప్రారంభించి మాట్లాడారు.  తమ కొడుకు జ్ఞాపకార్థం పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఫౌండేషన్​ స్థాపించామన్నారు. అనాథ వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి సేవలందిస్తున్నామని తెలిపారు. పేదలకు ఉచిత వైద్యం అందించాలని హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వైద్య బృందం, బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్య బృందంతో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశామని చెప్పారు.

ఫౌండేషన్ తరఫున వైద్యంతోపాటు ఉచితంగా మందులు అందజేశామన్నారు. బుధవారం సైతం హెల్త్ క్యాంపు కొనసాగుతుందని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గుమ్మడి సుచిత్ర, ఎక్లాస్ పూర్ క్యాంపు సర్పంచ్ సీతాకుమారి, ఎక్లాస్ పూర్ సర్పంచ్ ఈర్వంత్‌‌‌‌రావు పటేల్, మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్, బసవతారకం హాస్పిటల్ మేనేజర్ బిందు రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ లక్షణ్, డాక్టర్లు ప్రవళిక, సౌమ్య, జ్యోతి, అబ్దుల్, ఫౌండేషన్ నిర్వాహకులు రాము, మధు, నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు.