హనుమకొండ బస్టాండ్ ను డెవలప్ చేయండి : ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి

హనుమకొండ బస్టాండ్ ను డెవలప్ చేయండి : ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి

హనుమకొండ, వెలుగు: ఉమ్మడి జిల్లా రవాణాకు కేంద్రంగా ఉన్న హనుమకొండ బస్టాండ్ ను ఆధునికీకరించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కుడా చైర్మన్, హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి కోరారు.

వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సూచన మేరకు మంగళవారం మంత్రిని హైదరాబాద్ లో కలిసి వినతి పత్రం అందజేశారు. హనుమకొండ బస్టాండ్ ను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేయగా, ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారు.