- ఎస్సీ గురుకుల సెక్రటరీ విజయేంద్ర బోయి
హైదరాబాద్, వెలుగు: మహిళలు ఏ రంగం లో ఉన్నా పూర్తి నిబద్ధతతో పనిచేస్తారని ఎస్సీ గురుకుల సెక్రటరీ విజయేంద్ర బోయి అన్నా రు. ప్రస్తుతం అన్నిరంగాల్లో మహిళలు సత్తా చాటుతున్నారని తెలిపారు. శనివారం మసాబ్ ట్యాంక్‌లోని డీఎస్ఎస్ భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సెక్రటరీ విజయేంద్ర బోయి మాట్లాడారు. గురుకుల సొసైటీలో అధికారులు, ఉద్యోగులు, ప్రిన్సిపాల్స్, వార్డెన్లుగా అత్యధిక శాతం మహిళలే బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఆమె గుర్తుచేశారు.
లక్షలాదిమంది స్టూడెంట్లకు మహిళా అధికారులు, ఉద్యోగులు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారని పేర్కొన్నారు. అడిషనల్ సెక్రటరీ గీత మాట్లాడుతూ.. దేశంలో విద్య, ఉపాధి రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు పోటీ పడుతున్నారని వివరించారు. జాయింట్ సెక్రటరీ శారద మాట్లాడు తూ.. అటు కుటుంబ బాధ్యతలు, ఇటు వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్న మహిళా ఉద్యోగులను అభినందించారు.
