మహిళలు ఎదిగితేనే దేశాభివృద్ధి : మంత్రి సీతక్క

మహిళలు ఎదిగితేనే దేశాభివృద్ధి : మంత్రి సీతక్క
  • మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క శుభాకాంక్షలు 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మహిళలకు అవకాశాలు కల్పిస్తే ఒక కుటుంబం ఎదుగుతుందని, తద్వారా సమాజం బలపడి దేశం అభివృద్ధి సాధిస్తుందని మంత్రి సీతక్క శనివారం ఒక ప్రకట నలో పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళా లోకానికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. మహి ళల పోరాటం, పట్టుదల, అద్భుత ప్రతిభను గుర్తించి గౌరవించే రోజే మహిళా దినోత్సవమ ని పేర్కొన్నారు.

ఈ ఏడాది అంతర్జాతీయ మహి ళా దినోత్సవం థీమ్ గివ్ టు గెయిన్ అని, అంటే ఇస్తేనే సాధిస్తాం, పంచుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందనే సందేశాన్ని వివరించారు. మహిళల ఆర్థిక సాధికారత, సంక్షేమం, స్వయం ఉపాధి, సామాజిక భద్రతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు.