యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్, వెలుగు: యువత  డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. శనివారం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో  ప్రీమియర్ లీగ్ 2026  సీజన్ 5 మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి బహుమతి గెలిచిన చిమిర్యాల టీం ఫైటర్స్ కి, రన్నరప్ గా నిలిచిన నారాయణపూర్ మండల కేంద్రానికి చెందిన బీజేఆర్​యూత్  టీంలతో పాటు టోర్నమెంట్ కి సహకరించిన ప్రతీ ఒక్కరికి  బహుమతులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. నారాయణపూర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ఆడడానికి త్వరలోనే గ్రౌండ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం చౌటుప్పల్ మండలంలో దివిస్ సీఎస్ఆర్ నిధులతో పిలాయిపల్లి కత్వా నుంచి చౌటుప్పల్ మండలం లక్కారం  చెరువులోకి నీటి సరఫరాకు పైపులైన్​ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మండల అధ్యక్షుడు దేవేందర్, కాంగ్రెస్ సర్పంచులు, నాయకులు రాజు, ప్రభాకర్, విప్లవ్ కుమార్ పాల్గొన్నారు.