
చండూరు, మునుగోడు, గట్టుప్పల్, చిట్యాల, వెలుగు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చండూరు, గట్టుప్పల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గట్టుప్పల్స్థానిక చౌరస్తాలో మండల అధ్యక్షుడు నామని జగన్నాథం కేక్ కట్ చేసి స్వీట్లు పెంచిపెట్టారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి కాంగ్రెస్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వేముల వీరేశం పుట్టినరోజు సందర్భంగా ఆదివారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో పార్టీ శ్రేణులు వేడుకలు నిర్వహించారు.