మంత్రి జగదీష్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్

మంత్రి జగదీష్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్
  • స్థలం ఉన్నోళ్లు కట్టుకోవడానికి 3లక్షల చొప్పున నిధులివ్వాలని కోరా
  • బంగారు తెలంగాణ చేస్తానని.. తాగుబోతుల తెలంగాణ చేసిండు
  • దేశాన్ని ఉద్ధరిస్తానని ఢిల్లీకి వెళ్తున్న కేసీఆర్ను చూసి నవ్వుతున్నారు
  • ప్రశ్నించేవారు ఉండొద్దని ప్రతిపక్షాల వారిని పార్టీలోకి తీసుకుంటున్నారు
  • తెలంగాణ ప్రజలు చారిత్రక తీర్పు ఇవ్వబోతున్నారు
  • ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి కామెంట్స్

నల్గొండ జిల్లా: ఎప్పుడు చూసినా ప్రభుత్వ పథకాలకు కొబ్బరి కాయలు కొట్టడం మానుకుని.. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మునుగోడులో అభివృద్ధి చేసి చూపించాలని మంత్రి జగదీష్ రెడ్డికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ చేశారు. అభివృద్ధి అంటే కేసీఆర్ నియోజకవర్గానికి ఆరు వరసల రోడ్లు కాదు.. మా మునుగోడు నియోజకవర్గానికి వేసి చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మంత్రి జగదీశ్ రెడ్డి కి సవాల్ చేస్తున్నా.. మునుగోడు నియోజకవర్గానికి ప్రభుత్వ పథకాలకు కొబ్బరి కాయలు కొట్టకుండ, అభివృద్ధి కి నిధులు తేవాలి..అభివృధి అంటే కేసీఆర్ నియోజకవర్గానికి  ఆరు వరసల రోడ్లు కాదు , మా మునుగోడు నియోజకవర్గానికి వేసి చూపించు..’ అని సవాల్ చేశారు. 
ప్రశ్నించే వారు ఉండకూడదని.. ప్రతిపక్షాల నేతలను టీఆర్ఎస్ పార్టీలో కలిపేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. వేరే పార్టీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా అభివృధి కి అడ్డుపడుతున్నారని విమర్శించారు. నా నియోజక వర్గంలో కరోనా సమయంలో సుశీలమ్మ ఫౌండేషన్ తరపునా 5 కోట్ల రూపాయల నిత్యావసర సరుకులు పంచానని వివరించారు. అసెంబ్లీ సాక్షిగా నేను ప్రభుత్వాన్ని అడిగాను, ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూం కాదు తక్షణమే భూమి వున్న వారికి ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరానన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తా అని మద్యం, బెల్ట్ షాపులు పెంచి తాగుబోతుల తెలంగాణ చేశాడని ఆరోపించారు. ఇప్పుడు కొత్తగా దేశాన్ని ఉద్దరిస్త అని ఢిల్లీకి వెళ్తున్న కేసీఆర్ ని చూసి దేశంలో నవ్వుతున్నారు అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పోలీసులు టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ల మాదిరిగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు చారితాత్మక తీర్పు ఇవ్వబోతున్నారు అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. 

 

ఇవి కూడా చదవండి

రష్యాతో యుద్ధం చేసేందుకు తిరిగొచ్చిన ఉక్రెనియన్లు

డిసెంబర్ లో అసెంబ్లీని రద్దు చేసి మార్చిలో ఎన్నికలకు వెళ్తడు

జైలు కంటే వైద్యం ముఖ్యమని 1100 కోట్లతో కొత్త దవాఖాన