హాస్టల్స్ నిర్వహణ అధ్వానం : ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి

హాస్టల్స్ నిర్వహణ  అధ్వానం : ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి
  • ఎమ్మెల్యే ప్రభాకర్​రెడ్డి

దుబ్బాక, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వంలో హాస్టల్స్​ నిర్వహణ అధ్వానంగా ఉందని ఎమ్మెల్యే కొత్త  ప్రభాకర్​ రెడ్డి విమర్శించారు. శనివారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసులో నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ హాస్టల్స్​వార్డెన్లతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..విద్యార్థులకు కనీసం కాస్మొటిక్​చార్జీలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, సరైన మెయింటనెన్స్​ లేక వార్డెన్స్​అనేక అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. హాస్టల్​ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటిని మరమ్మతు చేయడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. 

మండలానికొక్క ఇంటిగ్రేటెడ్​ హాస్టల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్​ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే ఎమ్మెల్యేలను శత్రువులుగా చూసే పరిస్థితి వచ్చిందన్నారు. దుబ్బాక మున్సిపాలిటీకి మంజూరైన రూ.18 కోట్ల నిధులను రద్దు చేయించారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్​ వెంకటయ్య, రవీందర్​ రెడ్డి, యాదగిరి, రవి, కైలాస్, శ్రీనివాస్​, కిషన్​రెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు.