వర్ధన్నపేట,(ఐనవోలు)వెలుగు : ఐనవోలు మండల కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్ లో లబ్దిదారులు 91 మందికి సుమారు రూ. 91లక్షల 10వేల 556 ల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు.
అనంతరం పలు గ్రామాల్లో అనారోగ్యానికి గురైన వారు సీఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోగా మంజూరైన 70 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు సుమారు రూ. 18 లక్షల 95వేల పంపిణీ చేశారు.టేస్క్యాబ్ చైర్మన్ మార్నెని రవీందర్ రావు, ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..