పర్వతగిరి, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందని, గ్రామాల్లో డెవలప్మెంట్కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని వర్ధన్నపేట ఎమ్యెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని మల్యా తండా, ఏనుగల్లు, గుగులోతు తండా, చింతనెక్కొండ, దౌలత్ నగర్, చెరువుకొమ్ము తండాలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలోనే ఇందిరమ్మ ఇండ్లు సాకారమయ్యాయని, ఆలోచించకుండా ఓటు వేస్తే ఐదేండ్లు అవస్థలు పడాల్సి వస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, 25 లక్షల మంది రైతులకు రూ.21వేల కోట్ల రుణ మాఫీ చేశారని, 9 రోజుల్లో రూ.9వేల కోట్లు రైతులకు పెట్టుబడి సాయం అందించడం ఒక చరిత్ర అని కొనియాడారు.
కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌నాయక్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దేవేందర్‌రావు, జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, పర్వతగిరి మండలంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయా గ్రామాల్లో రెబల్స్, స్థానికుల నిరసన సెగలు ఎదురైంది.
