ప్రతి ఒక్కరూ జనగణనలో పాల్గొనాలి : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

ప్రతి ఒక్కరూ జనగణనలో పాల్గొనాలి : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వర్ధన్నపేట/ కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు: ప్రతి ఒక్కరూ జనగణనలో పాల్గొనాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు పిలుపునిచ్చారు. ఆదివారం వరంగల్​జిల్లా వర్ధన్నపేట పట్టణంలోని స్వామి వివేకానంద విగ్రహం నుంచి అంబేద్కర్​ సెంటర్​ వరకు జనగణన అవగాహన ర్యాలీ నిర్వహించగా, ఎమ్మెల్యే, కలెక్టర్​ సత్యశారద పాల్గొన్నారు.  జనగణన వివరాల సేకరణ పురోగతిని హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ఇన్​చార్జి కమిషనర్​ చాహత్​బాజ్​పాయ్​ పరిశీలించారు. కాజీపేటలోని నక్కలగుట్ట, వరంగలోని కాశీబుగ్గ సర్కిల్​ ఆఫీస్​లను సందర్శించి హౌస్​ లిస్టింగ్​ ప్రక్రియ పై ఆరా తీశారు.