ఆర్టీసీకి అప్పు ఇచ్చే స్థాయికి ఎదిగిన మహిళలు : ఎమ్మెల్యే కూనంనేని

ఆర్టీసీకి అప్పు ఇచ్చే స్థాయికి ఎదిగిన మహిళలు : ఎమ్మెల్యే కూనంనేని

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తొందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.  కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్​లో మంగళవారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలను నిర్వహించారు. మహాలక్ష్మి స్కీంలో భాగంగా ఆర్టీసీకి బస్సును పెట్టిన పాల్వంచ మహిళా సంఘానికి ఈఎంఐ కింద రూ. 69,468 చెక్కును ఆర్టీసీ చెల్లించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీకి అప్పు ఇచ్చే స్థాయికి మహిళలు ఎదిగారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయంలో రేషన్​ కార్డుల పంపిణీ జరగలేదన్నారు. ఈ ప్రభుత్వం కొత్త రేషన్​ కార్డులను ఇస్తొందన్నారు. ప్రోగ్రాంలో స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్​ విద్యాచందనతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.