కొమురయ్య చేసిన సేవలు చిరస్మరణీయం : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

కొమురయ్య చేసిన సేవలు చిరస్మరణీయం : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి కార్మిక లోకానికి మనుబోతుల కొమురయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీస్ ఎదుట ఏర్పాటు చేసిన యూనియన్ నేత మనుబోతుల కొమురయ్య కాంస్య విగ్రహాన్ని సోమవారం ఎమ్మెల్యేతో పాటు యూనియన్​ నేతలు ఆవిష్కరించారు. 

ప్రోగ్రాంలో యూనియన్​అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కె.రాజ్​కుమార్, కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్ మేయర్​ మూడ్ గణేశ్, ఏఐటీయూసీ, సీపీఐ నేతలు పాల్గొన్నారు.