లాస్య నందిత కారు యాక్సిడెంట్.. లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు

 లాస్య నందిత కారు యాక్సిడెంట్.. లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు

సికింద్రాబాద్, కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పటాన్ చెరు పోలీసులు..కీలక ఆధారాలను సేకరించారు. లాస్య  కారు ఢీ కొన్న టిప్పర్ లారీని గుర్తించారు. దానిని పోలీసులు సీజ్ చేశారు.  లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో డ్రైవర్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. లాస్య కారు మొదట లారీని ఢీకొట్టినట్లు పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే.

సరిగ్గా వారం క్రితం అంటే.. ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున లాస్య నందిత కారు పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురై మరణిచారు. ఆమె కారు అదుపుతప్పి లారీ ఢీకొట్టి రెయిలింగ్ ను గుద్దడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే చనిపోగా..  కారు నడిపిన పీఎ ఆకాశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుం ఆకాశ్ఆస్పత్రిలో చికిత్స పొంతున్నాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు... ఆకాశ్ నిద్రమత్తులో కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు.