కేపీహెచ్బీ కాలనీలోని ఆలయ స్థలాలు అమ్ముడేంది : ఎమ్మెల్యే కృష్ణారావు

కేపీహెచ్బీ కాలనీలోని ఆలయ స్థలాలు అమ్ముడేంది : ఎమ్మెల్యే కృష్ణారావు

కూకట్​పల్లి, వెలుగు: హౌసింగ్​బోర్డు స్థలాల అమ్మకాన్ని వెంటనే విరమించుకోవాలని కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రభుత్వానికి సూచించారు. కేపీహెచ్​బీ కాలనీలోని వరసిద్ధి వినాయక ఆలయం పక్కన స్థలాన్ని ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని తెలుసుకున్న ఆయన మంగళవారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు.

 అనంతరం కేపీహెచ్​బీ డివిజన్​ కార్పొరేటర్​ మందడి శ్రీనివాసరావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజోపయోగమైన స్థలాలతో పాటు ఆలయ భూములను కాంగ్రెస్​ వదలడం లేదన్నారు. హౌసింగ్​బోర్డు స్థలాల విక్రయాన్ని నిలిపివేయకుంటే బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.