హైడ్రాకు హైప్ తెచ్చేందుకే కూల్చివేతలు : బీజేపీ ఫ్లోర్‌‌‌‌ లీడర్‌‌‌‌ మహేశ్వర్‌‌‌‌రెడ్డి

హైడ్రాకు హైప్ తెచ్చేందుకే కూల్చివేతలు : బీజేపీ ఫ్లోర్‌‌‌‌ లీడర్‌‌‌‌ మహేశ్వర్‌‌‌‌రెడ్డి

సంగారెడ్డి టౌన్, వెలుగు : హైడ్రాకు హైప్‌‌‌‌ తీసుకొచ్చేందుకే సెలబ్రిటీల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్‌‌‌‌ లీడర్‌‌‌‌ మహేశ్వర్‌‌‌‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందుగా మంత్రులు, కాంగ్రెస్‌‌‌‌ లీడర్ల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని సవాల్‌‌‌‌ చేశారు. సంగారెడ్డి బీజేపీ జిల్లా ఆఫీస్‌‌‌‌లో ఆదివారం ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌‌‌‌ పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు సహకరించిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోకుండా, మధ్యతరగతి ప్రజలు నష్టపోయేలా వ్యవహరించడం సరికాదన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా అన్యాక్రాంతమైన అసైన్డ్‌‌‌‌, ఎండోమెంట్‌‌‌‌, ఫారెస్ట్‌‌‌‌ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. దానం నాగేందర్‌‌‌‌పై కేసు నమోదు చేసిన పోలీసులు, వెంటనే అతడిని అరెస్ట్‌‌‌‌ చేయాలన్నారు. మంత్రి పొంగులేటిపై కూడా ఆరోపణలు వస్తున్నాయన్నారు. సీఎం సోదరుడి ఆక్రమణలను కూల్చివేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా ? అని ప్రశ్నించారు. చట్టబద్ధంగా నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నారు. 

సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజిరెడ్డి, విష్ణువర్ధన్‌‌‌‌రెడ్డి, రవీందర్, ఎడ్ల రమేశ్‌‌‌‌, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు అనంతరావు కులకర్ణి రాజశేఖర్‌‌‌‌రెడ్డి, దోమల విజయకుమార్‌‌‌‌, ప్రభాకర్ గౌడ్, సుధీర్‌‌‌‌, బండారి శ్రీనివాస్‌‌‌‌గుప్తా పాల్గొన్నారు.