పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సహకరిస్తా : మహిపాల్ రెడ్డి

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సహకరిస్తా : మహిపాల్ రెడ్డి
  • ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు: ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం రామచంద్రాపురంలోని పెన్షనర్ల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో నిర్మించిన పెన్షనర్ల భవనం ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదని, పక్కనే ఉన్న ఆర్సీపురం ప్రెస్​ క్లబ్ సభ్యులతో మాట్లాడి వారికి పైన నిర్మించే రూమ్​లను కేటాయించేలా నిర్ణయం తీసుకుంటానన్నారు. 

రూ. 30 లక్షల నిధులతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఎంతో అనుభవం కలిగిన ప్రభుత్వ పెన్షనర్లు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్​ పుష్ప, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు రాంరెడ్డి, జనరల్​సెక్రటరీ రాములు, నగేశ్​ యాదవ్, రామచంద్రాపురం జర్నలిస్టులు పాల్గొన్నారు. 

పారదర్శకంగా విద్యా వలంటీర్ల ఎంపిక

పటాన్​చెరు: పటాన్‌‌చెరు నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న విద్యా వలంటీర్లు, ఆయా పోస్టుల భర్తీ  ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని క్యాంపు ఆఫీసులో అభ్యర్థుల ఇంటర్వ్యూలు ఎంపిక కమిటీ సమక్షంలో నిర్వహించినట్లు చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో 16 విద్య వలంటీర్ పోస్టులు,16 ఆయా పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులపై సమీక్ష చేపట్టి అర్హత కలిగిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించామని తెలిపారు. 

విద్యా వలంటీర్లకు ఇంటర్​అర్హత తప్పనిసరి కాగా ప్రీ -ప్రైమరీ టీచర్ శిక్షణ పొందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చినట్టు వివరించారు. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను కలెక్టర్‌‌కు పంపించామని త్వరలో ఆయా మండల విద్యాశాఖ ఆఫీసుల్లో వారి పేర్లను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు.