రామచంద్రాపురం, వెలుగు: త్వరలో జరిగే జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో మాస్టర్స్అథ్లెటిక్స్అసోసియేషన్ క్రీడాకారులు సత్తా చాటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే, అసోసియేషన్రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి సూచించారు. ఆదివారం భారతీనగర్ డివిజన్ పరిధిలో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇటీవల కరీంనగర్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఓవరాల్ చాంపియన్గా నిలిచిన జిల్లా జట్టుకు ఆయన ట్రోఫీలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు, యువతకు క్రీడలపై ఆసక్తి పెంపొందేలా మాస్టర్స్ అథ్లెటిక్స్ సభ్యులు పలు క్రీడల్లో పాల్గొనడం స్ఫూర్తిదాయకమన్నారు. అసోసియేషన్ కార్యక్రమాలకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
త్వరలో జరిగే నేషనల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర పేరును నిలపాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మర్రి లక్ష్మారెడ్డి, జిల్లా కన్వీనర్ గురవా రెడ్డి, బీహెచ్ఈఎల్మాజీ ఈడీ ఉదయ్ కుమార్, ఇతర సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
