ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

రాయపర్తి, వెలుగు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ఆదివారం వరంగల్​ జిల్లా రాయపర్తి మండలంలోని కొలన్ పల్లి, ఆరె గూడెం, కేశవపురం, ఎర్రకుంట తండా, జింకురాం తండా, కొండూరు, గన్నారం, తట్టెకుంటతండా, తిర్మలాయపల్లి, జెతురాం తండా, రాగన్న గూడెం, మహబూబ్ నగర్, గణేశ్​కుంట తండాల్లో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలో పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలిస్తేనే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. గ్రామాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోతు అమ్యా నాయక్, నాయకులు తిరుమల కృష్ణమాచార్యులు, సరికొండ కృష్ణా రెడ్డి, ముద్రబోయిన వెంకటేశ్వర్లు, రెంటాల గోవర్ధన్ రెడ్డి, కుందూరు రత్నాకర్ రెడ్డి, కుందూరు రాంరెడ్డి, గిరాగాని రాజు, చెట్టే ఎల్లేశ్, యాకయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.